పెంటపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా కసిరెడ్డి మధులత నామినేషన్ దాఖలు

పెంటపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా కసిరెడ్డి మధులత నామినేషన్ దాఖలు
పశ్చిమగోదావరి జిల్లా | మెగా గళం న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో రాజకీయ సందడి నెలకొంది. పెంటపాడు ఎంపీటీసీ-2 జనసేన వీరమహిళ నాయకురాలు, ద్వారకాతిరుమల ఆలయ కమిటీ సభ్యురాలు కసిరెడ్డి మధులత ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి మధులత మాట్లాడుతూ.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించలేదని విమర్శించారు. గత ఐదేళ్లలో ఎంపీటీసీలు ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశాలు పొందలేకపోయారని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు నాయకత్వ అవకాశాలు కల్పిస్తూ, పల్లెల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు.
తనకు ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు కసిరెడ్డి మధులత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉపయోగించుకుంటానని పేర్కొన్నారు.
కూటమి నాయకుల హాజరు
కసిరెడ్డి మధులత నామినేషన్ కార్యక్రమంలో పుల్లా బాబి, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, దత్తు ప్రసాద్, దాసరి కృష్ణవేణి, కొనగళ్ల హరినాథ్, సామినేని వెంకట సత్యవతి, కొవ్వూరు లక్ష్మారెడ్డి, చామన సురేష్, పాపారావుతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
By: ఆకుల రమేష్  |  పెంటపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా కసిరెడ్డి మధులత నామినేషన్ దాఖలు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *