వెంకట్రావుపాలెం అభివృద్ధికి మణెమ్మ హామీ.. గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా!

వెంకట్రావుపాలెం అభివృద్ధికి మణెమ్మ హామీ.. గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా!
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత | ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో అభివృద్ధి పనులు చేపడతానని వెల్లడి
పశ్చిమగోదావరి జిల్లా | తాడేపల్లిగూడెం రూరల్ | వెంకట్రావుపాలెం:
గ్రామ అభివృద్ధి.. ప్రజా సంక్షేమం.. మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచినట్లు వెంకట్రావుపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థి మాదాసు మణెమ్మ వెల్లడించారు. గ్రామ ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వెంకట్రావుపాలెంను అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె పేర్కొన్నారు.
ప్రజలకు అండగా కుమారుడు సురేష్..
తన కుమారుడు సురేష్ జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని మణెమ్మ తెలిపారు. రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తూ, తన సొంత ఖర్చులతో పలు సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు.
గ్రామంలోని అంగన్వాడీ భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, తాగునీటి సమస్యలు తలెత్తినప్పుడు బోర్లు, పైపుల మరమ్మతులు చేయించడం, డ్రైనేజీల పూడికతీత వంటి పనులకు సహకరించినట్లు తెలిపారు.
ఆపదలో ఉన్నవారికి వైద్య సహాయం..
గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించి ఆసుపత్రులకు తరలించడం, అవసరమైన వైద్య సహాయం అందేలా చూడటంలో ముందుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో అర్హులైన బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
గ్రామంలో పరిష్కరించాల్సిన సమస్యలివే..
వెంకట్రావుపాలెంలో ప్రస్తుతం తాగునీటి బోర్ మోటార్ మరమ్మతు, కొత్త మోటార్ ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రహదారుల అభివృద్ధి, శ్మశానవాటిక అభివృద్ధి వంటి సమస్యలు ఉన్నాయని మణెమ్మ తెలిపారు.
తనకు ప్రజలు అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
కూటమి ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మణెమ్మ.. అదే తరహాలో గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రతి సమస్యకు పరిష్కారం చూపడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాదాసు మణెమ్మ విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *