ఆరుల్ల గ్రామ అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటా: సర్పంచ్ అభ్యర్థి సుశీల

తాడేపల్లిగూడెం | నవంబర్ 20 | మెగాగళం న్యూస్:

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే తన లక్ష్యమని ఆరుల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుశీల స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆమె తెలిపారు.

గ్రామ పెద్దలు, స్థానిక నాయకుల ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సుశీల వెల్లడించారు. తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందని, గతంలో కుటుంబ సభ్యులు గ్రామానికి చేసిన సేవలు తనకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

గ్రామంలో తాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం, పుంత రహదారులను నిర్మించడం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తానని ఆమె వివరించారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే రహదారి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా

సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తానని సుశీల హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

– మెగాగళం న్యూస్

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *